Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ఇటీవల రూ.5-6 మధ్య లభించిన కోడిగుడ్డు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రూ.9-10కు చేరగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.340-350 వరకు పెరిగింది. వేసవి తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, సోయా, మొక్కజొన్న వంటి దాణా ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో గుడ్లు, చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -