Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్ఐ శివరాం 

కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్ఐ శివరాం 

- Advertisement -

సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
నవతెలంగాణ – దర్పల్లి

మండల పరిధిలోని మేలియా తాండాకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ బాదావత్ శివరాం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి శివరాంకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, విధానాలకు ఆకర్షితులై నాయకులు పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బల్ రాజ్ తోపాటు, మండల అధ్యక్షులు గాదె నరేష్, సర్పంచ్ చెలిమేల  శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మురళి, వార్డు సభ్యులు చక్రపాణి, అయ్యాగ్రామాల కాంగ్రేస్ పార్టీ సర్పంచులు, కార్యకర్తలు, తదితరులు, భారీగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -