Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమలయ్య ఆలయం వద్ద అ"పూర్వ"కలయిక

తిరుమలయ్య ఆలయం వద్ద అ”పూర్వ”కలయిక

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1987-88 ఏడవ తరగతి అపూర్వ విద్యార్థులు కలిసి ఒకరి యోగ క్షేమాలను ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఈ అపూర్వ కలయిక శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలయ్య ఆలయం వద్ద అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా  దాదాపు 38 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం ఎన్నో మధురానుభూతులను కల్గించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిలో కొందరు రాజకీయ నాయకులు కాగా.. ఇంకోందరు, ఉద్యోగాల్లో, వ్యవసాయం, వ్యాపారం, డాక్టర్ గా చేస్తూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్, డాక్టర్ సామల రాజేష్ లు పేర్కొన్నారు.

ఎప్పటి నుండో చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకున్నామని, అంతిమంగా ఒక్కొక్కరితో కలుస్తూ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎట్టకేలకు ఇన్నేండ్ల తర్వాత అందరూ ఒకే చోట కలిసి సమ్మేళనం నిర్వహించుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి కలిగిందని వారన్నారు. గతంలో చుట్టూ పక్కల గ్రామాల నుండి గన్నారం పాఠశాల వచ్చే వారమని 87-88లో గన్నారం పాఠశాల 7వ తరగతి వరకే ఉండేదని, నేడు అదే పాఠశాల 10 వ తరగతి వరకు ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ సమ్మేళనం లో చింతల కిషన్, డాక్టర్ సామల రాజేష్, లింగం, రాజేశ్వర్, స్వామి,వెంకటి, రాజలక్ష్మి,గిరీజా,విజయ నిర్మల తోపాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమితులైన చింతల కిషన్ కు ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -