- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని టోలిచౌకి పరిధి షేక్‌పేట్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం నిలిపి ఉంచిన ఒక స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెట్రోల్ బంక్‌కు సమీపంలోనే మంటలు ఆరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



