Friday, July 17, 2026
E-PAPER
Homeక్రైమ్ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. యువకుడు ఆత్మహత్య 

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. యువకుడు ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేయటంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని లెంకలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.మర్రిగూడ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం లెంకలపల్లి గ్రామంలో కొంతమంది నిరుద్యోగ యువత ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.ఆ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగికి లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల వెంకటయ్య చిన్న కుమారుడు శివ(23) కు ఆ కంపెనీలో పనిచేసే మిత్రుల ద్వారా పరిచయం ఏర్పడింది.ఆమె శివకు కూడా ఆ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ పలికి అందుకు శివ నుండి 55 వేల రూపాయలను తీసుకుంది.

డబ్బులు తీసుకొని చాలా రోజులు కావడం,ఉద్యోగం ఇప్పించకపోవడంతో శివ తన డబ్బులు ఇవ్వాలంటూ ఆ కంపెనీ మహిళా ఉద్యోగికి  కాల్ చేశారు.తనకు ఫోన్ చేస్తే కేసు పెడతానని ఆమె శివను బెదిరించడంతో డబ్బులు నష్టపోయానని మనస్థాపం చెందిన శివ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు.ఇంట్లో అపస్మారక స్థితిలో  పడి ఉన్న శివను ఇరుగుపొరుగువారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.మృతుడి అన్న వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు.ఆ కంపెనీకి చెందిన వాహనం శుక్రవారం ఎంప్లాయిస్ ని తీసుకపోవడానికి లెంకలపల్లి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆ వాహనాన్ని అడ్డుకొని శివ కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఆందోళన చేపట్టారు.అందరితో ఎంతో కలువిడిగా మాట్లాడే శివ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -