•యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్
నవతెలంగాణ – మర్రిగూడ
అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని మండలంలోని యరగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు.శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడారు.చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మర్రిగూడ మండలంలో అంగన్వాడీ టీచర్ 5 ,ఆయా 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు 67 మంది,ఆయా పోస్ట్ లకు 24 మంది చొప్పున, మొత్తం 91 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులు చేస్తున్నారని,ప్రక్రియను అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళకు గురికాకుండా పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.
అంగన్వాడీ నియామకాల్లో రాజకీయ జోక్యం వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



