- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
ప్రతి శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించే నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో సర్పంచ్ గీతారాణి సుధాకర్ పాల్గొన్నారు. ఇందలో భాగంగా ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి ఆవరణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. తద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ హజహర్ అలీ, సెక్రటరీ నరేష్, వార్డుల సభ్యులు, ఆశ వర్కర్లు, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



