Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయంసీజేపీ పార్లమెంట్ మార్చ్ కు అనుమతి నిరాకరణ

సీజేపీ పార్లమెంట్ మార్చ్ కు అనుమతి నిరాకరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 20న సీజేపీ(కాక్రోచ్ జనతా పార్టీ) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వాంగ్ చుక్ ను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈనెల 20 నుంచి శీతకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా మొదటి రోజు కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎదుట శాంతియత నిరసనలకు పిలుపు నిచ్చారు. ఈ ధర్నాకు అనుమతి కోరుతు ఢిల్లీ పోలీసులకు వినతి పత్రం సమర్పించగా..పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని తెలియజేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో బీఎన్ ఎస్ సెక్షన్ 163 విధించినట్లు తెలియజేశారు. దీంతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో నలుగురుకు మించి ఉండకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -