Sunday, August 30, 2026
E-PAPER
Homeజాతీయంసోనమ్ వాంగ్ చుక్ హెల్త్ బులెటెన్ విడుదల

సోనమ్ వాంగ్ చుక్ హెల్త్ బులెటెన్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతికిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ 21 రోజులనుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహర దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం వాంగ్ చుగ్ ను దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. తాజాగా వాంగ్ చుగ్ కు సంబంధించిన హెల్త్ నివేదికను విడుదల చేశారు. సుదీర్ఘంగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించడంతో ఆరోగ్యం క్షీణిచిందని, డీహైడ్రేషన్ గురయ్యారని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ఆయనను సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతర పర్యవేక్షణ, చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -