నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతికిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ 20 రోజులనుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహర దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం వాంగ్ చుగ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. వాంగ్ చుగ్ కు రోజురోజుకు పెరుగుతున్న మద్దతును జీర్ణించుకోలేని మోడీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ప్రశ్నించే గొంతులకు మద్దతుగా నిలిచే ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంది.
ఈక్రమంలోనే తాజాగా అసోంలోని గౌహతి పూర్ పీఎస్ పరిధిలోని ఓ ఫ్లై ఓవర్ ఫిల్లర్ పై సోనమ్ వాంగ్ చుక్ చిత్రాన్ని వేశారు. ఆ పిల్లర్ పై పెయింట్ వేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు విచిత్రమైన కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే చర్యగా, వాంగ్ చుగ్ చిత్ర ముద్రణతో ఫ్లై ఓవర్ విధ్వంసానికి ప్లాన్ చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



