నవతెలంగాణ-వనపర్తి
సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై 17న జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ హై స్కూల్, జెడ్పిహెచ్ఎస్ తెలుగువాడ హై స్కూల్ లను సర్వే చేశారు. సర్వే లో వచ్చిన సమస్యలను సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలియజేస్తూ విద్యార్థులతో ప్రసంగించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి, విద్యాశాఖ మంత్రి కి జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యారంగంపై అధ్యయనం చేస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర వనపర్తిలో సమస్యలకు నిలయంగా ఉందని వాష్ రూమ్స్ ఉన్న వాటిని శుభ్రం చేసే స్కావెంజర్ లేక అశుభ్రంగా ఉందని గత సంవత్సరం వలె పాఠశాలకు నెలకు 20,000 స్కావెంజర్ నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
750 మంది విద్యార్థులు చదువుతున్నారని వారికి నేటికీ యూనిఫార్మ్స్ ఇవ్వలేదన్నారు. ఇంకా కొంతమందికి పాఠ్యపుస్తకాలు అందలేదన్నారు. వెంటనే మిగిలిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. వంటగది ఉన్న దొంగల బెడద ఎక్కువగా ఉందని, ఇప్పటికే 3 సార్లు రాత్రులు దొంగతనం జరిగిందని పోలీసు రిపోర్టు చేసిన ఎవరు దొరకలేదని రాత్రుల పూట పోలీసులు పెట్రోలింగ్ చేయాలని అన్నారు. రాజీవ్ స్వగృహ దగ్గర ఉన్న ఎస్సీ, ఎస్టీ ఆనంద నిలయం హాస్టల్స్ నుండి 200 మంది విద్యార్థులు ఈ హైస్కూల్ కు చదువుకోవడానికి వస్తున్నారు . నాగవరం దగ్గర ఉన్న బీసీ హాస్టల్ నుంచి 100 మంది ప్రతిరోజు రెండు, మూడు కిలోమీటర్లు కాలినడకన రావాల్సి ఉంటుందని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రభుత్వం వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
దాదాపు 300 మంది విద్యార్థులు ఇట్టి హాస్టల్ విద్యార్థులే ఉన్నారని అన్నారు. త్రాగునీరు సమస్య ఉందని వెంటనే తాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాష్ రూమ్స్ కు నీటి వసతి నల్లాలకు కనెక్షన్ లేదని వెంటనే వాటిని పూర్తిచేయాలని అన్నారు. అటెండర్స్ ఇద్దరు కావాలని, స్వీపర్ ఒకరు కావాలని అన్నారు. ఐ. ఎఫ్. పి ప్యానెల్స్ 19 క్లాసులకు గాను 6 ఉన్నాయని ఇంకా 13 ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్, బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ కలిసి ఉన్నాయని ఒక పెద్ద డూమ్ లైట్ ఉంటే దొంగల బెడద తగ్గుతుందని అన్నారు. రోజువారి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినందువల్ల, పప్పు నూనె కూరగాయలు అన్ని రకాల రేట్లు పెరిగినయి కాబట్టి ఒక్కో విద్యార్థికి ఇచ్చే ధర పెంచాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగువాడ హైస్కూల్లో సమస్య లు స్వాగతం పలికాయి. గత రెండు సంవత్సరాలుగా పీఈటి లేరన్నారు. ప్రహరీ గోడ లేదు. బాలురకు వాష్ రూమ్స్ లేవు. స్థలం ఉన్న కాంపౌండ్ కూడా నిర్మించేందుకు నిధులు మంజూరు కాలేదు. వాష్ రూమ్స్ నిర్మించాలంటే చుట్టుపక్కల వారు ఆటంకపరుస్తున్నారు. 5 తరగతి లకు గాను 4 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు గదులు 1977లో నిర్మించినవి. పడావు పడ్డవి. ఎప్పుడూ కూలుతావో తెలియదు. వెంటనే పాత రెండు గదులతో పాటు, అదనంగా రెండు గదులు నిర్మాణం చేయాలి. యూనిఫార్మ్సు నేటికీ రాలేదు. పుస్తకాలు అందరికీ అందలేదు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు రెండు పాఠశాలలో వచ్చిన సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు జి బాలస్వామి బిసన్న నందిమల్ల రాములు సీపీఐ(ఎం) ఆఫీస్ కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు.



