నవతెలంగాణ-బజార్ హత్నూర్
జెడ్పీఎస్ఎస్ బజార్ హత్నూర్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గానూ 557 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని రబిడే త్రిషను ఘనంగా అభినందించారు. పాఠశాల మాజీ ఉపాధ్యాయులు ఆర్. ప్రకాష్ (రిటైర్డ్), సోనాల విద్యార్థిని ప్రతిభను గుర్తిస్తూ తన వంతు ప్రోత్సాహంగా రూ.1,000 నగదు బహుమతిని ప్రకటించారు. ఈ బహుమతిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. భూమన్న చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా స్ఫూర్తినివ్వవచ్చని పేర్కొన్నారు. రబిడే త్రిష భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని టాపర్ విద్యార్థినిని అభినందించారు.
జెడ్పీహెచ్ ఎస్ బజార్ హత్నూర్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



