నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పురాతన, వారసత్వ సంపదకు నిలయం మెదక్ జిల్లా అని హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత మంచు విష్ణు అన్నారు. శనివారం మెదక్ జిల్లాలో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు ఏడుపాయలకు చేరుకోగానే అదనపు కలెక్టర్ నగేష్ మొక్క ను అందించి స్వాగతం పలికారు. ఏడుపాయల ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మత గుడిలోకి తీసుకెళ్లరూ.. సినీ నటుడు మంచు విష్ణు ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన, అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.
ఆలయ చరిత్ర ప్రాముఖ్యాన్ని అదనపు కలెక్టర్ నగేష్ మంచు విష్ణు కు వివరించారు. అనంతరం చారిత్రక నేపథ్యం కలిగిన మెదక్ ఖిల్లాను సందర్శించి దాని చరిత్రను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పురాతన, వారసత్వ సంపదకు నిలయం మెదక్ జిల్లా అన్నారు. మన చరిత్ర గురించి పుస్తకాల్లో చదివాం,ఎన్నో విన్నాం కానీ చూసింది చాలా తక్కువ అని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు.
మనకున్న చరిత్ర 95% ప్రపంచంలో వేరే దేశాలకు ఎవరికి లేదు అన్నారు..ఆ చరిత్రను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. ఇక్కడున్న జిల్లా యంత్రాంగం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసినట్టు తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు, చారిత్రిక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.. వాటిని కాపాడుకోవాలి.. హైదరాబాద్ నుంచి మెదక్ కు కూతవేటు దూరంలో ఉన్న చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని చూడకపోవడం సిగ్గుచేటు అనిపించింది అన్నారు. మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నారు .. భవిష్యత్తులో నేను నటించే సినిమాలో కానీ ప్రొడ్యూస్ చేసే సినిమాలో అయినా మెదక్ నుంచి ఒక సినిమాకు అవకాశం ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ నవీన్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, డి ఎస్ పి ప్రసన్న కుమార్, మిడియా ప్రతినిధులు పాల్గొన్నారు .



