Saturday, August 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు

నాసిరకం పనులపై మండిపడ్డ గ్రామస్తులు

- Advertisement -

తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేసిన వార్డు సభ్యులు
నవతెలంగాణ-కుభీర్
శనివారం మండల కేంద్రంలోని మేదరి కాలనీలో మురికి కాలువలు నిర్మాణ దశలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..మురికి కాలువల అభివృద్ధి పనులు మొదలుపెట్టిన నాటినుంచే నాసిరకంగా జరుగుతున్నాయనీ, ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.

కాంట్రక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వృధా కావడమే కాక, పనుల పురోగతి నిలిచిపోయిందని, దీంతో మళ్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని అన్నారు. పనులు జరిగే చోట వార్డు సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులను నిలదీశారు. అలాగే జరిగిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా.. ఈసారి ప్రత్యేక పర్యవేక్షణతో పాటు నాణ్యతతో పనులు చేపట్టాలని, తహశీల్దార్ శ్రీదేవికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అనిల్, బషీర్ వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -