Saturday, August 8, 2026
E-PAPER
Homeఖమ్మంఅనారోగ్య బాధితులకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

అనారోగ్య బాధితులకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరిని బీఆర్ఎస్ నాయకులు శనివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన సుంకవల్లి సూరి పండు ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. 

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల సమన్వయకర్త జేకేవీ రమణారావు,ఎంపీపీ మాజీ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి, యూఎస్ ప్రకాష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సంక ప్రసాద్, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నారం రాజశేఖర్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ఇటీవల ద్విచక్రవాహనం నుంచి కిందపడటంతో గాయపడిన యడవల్లి భద్రం నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు కోడూరి నాగేశ్వరరావు, బ్రహ్మాజీ, బండారు సుబ్బారావు, కొవ్వసి రాంబాబు, తెల్లం హరిబాబు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -