- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్దగుల్ల తాండలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసిన లబ్ధిదారులకు ఆ గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ గోడ గడియారాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించామని తెలిపారు. నిర్మాణాలు పూర్తైన తర్వాత దశల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి నాగయ్య, గ్రామస్తుడు వికాస్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



