Saturday, August 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..ఏడుగురి మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..ఏడుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తిస్సా–బైరాగఢ్ రహదారిపై చలుజ్ మోర్ సమీపంలో శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని తిస్సా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -