- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో శనివారం మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్‌గూడలో భూసేకరణ చేపట్టేందుకు రెవెన్యూ, హైడ్రా (HYDRAA) అధికారులు రంగంలోకి దిగారు. సేకరించిన భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, స్థానిక రైతులు దీనిని తీవ్రంగా అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న పంట పొలాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అధికారులు అకస్మాత్తుగా వచ్చి తమ జీవనాధారమైన సాగు భూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకోమని, తమకు ప్రత్యామ్నాయంగా భూమికి భూమి కేటాయించిన తర్వాతనే ఇక్కడి నుండి వెళ్తామని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌డీవో (RDO) స్వయంగా వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఫెన్సింగ్ ప్రక్రియను నిలిపివేయాలన్నారు.
- Advertisement -



