గ్రామమలో 97%పూర్తి చేసిన బిఎల్ఓలకు సన్మానం
నవతెలంగాణ-కుభీర్
ముధోల్ నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పీషల్ ఇంటెన్స్ రివిజన్ పక్రియలో భాగంగా కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలో శనివారం ముధోల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ పక్రియ ప్రతి ఒక్క బిఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. దీంతో కలిసి గ్రామంలో 97% పూర్తి చేసిన బి ఎల్ ఓ లకు నారాయణ్ రావు పటేల్ అభినదించి వారికి శలవాతో సన్మానించారు. అదే విదంగా మిగితా ముడు శాతం కూడా గడువు కంటే ముందు పూర్తి చేస్తే వారికి అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట జిల్లా డీసీసీ జనరల్ కార్యదర్శి బంక బాబు, మండల యువ నాయకుడు ప్రధాన కార్యదర్శి పురం శెట్టి రవికుమార్, శంకర్ చంద్రే, మండల నాయకులు బషీర్ ఖాన్, ఉప సర్పంచ్ గజ్జరం, వార్డ్ సభ్యులు కామాజీ, విలాస్, రాజు క్రాంతి కుమార్, కొట్టె హనుమల్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ఎస్ఐఆర్ పక్రియను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -



