Saturday, July 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బీసీ వసతి గృహాన్ని పునః ప్రారంభించాలని వినతి

బీసీ వసతి గృహాన్ని పునః ప్రారంభించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పల్సి గ్రామంలో గతంలో పేద మధ్య తరగతి విద్యార్థుల కొరకు ప్రభుత్వం బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాబ్యాసం చేశారు. దీంతో వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య  రోజురోజుకు తగ్గిపోవడంతో వసతి గృహం పూర్తిగా నిరుపయోగంగా మారిందన్నారు. దీంతో ఇక్కడి పేద మధ్యతరగతి విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మూతపడ్డ బిసి వసతి గృహాన్ని పున ప్రారంభించాలని శనివారం గ్రామస్తులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దంతుల సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ వసతి గృహాన్ని పునః ప్రారంభించేందుకు ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు అందించి వసతి గృహాన్ని పునః ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమస్యను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు శ్రీరాముల రాజేష్, తెలిపారు. వారి వెంట గ్రామస్తులు ఉప సర్పంచ్ గజ్జరాం, రాజు, పాల రాకేష్, కామాజీ, రాజు,సాయిబాబా,తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -