- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని రంజిని గ్రామానికి చెందిన సీతబాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో శనివారం ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగితెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్, కార్యదర్శి బంక బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పురం శెట్టి రవికుమార్, శంకర్ చంద్రే కొట్టె హనుమల్లు, క్రాంతి కుమార్, విలాస్ కామాజీ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



