Friday, August 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయనకు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందిలో ఒకరు విధి నిర్వహణలో ఉండగానే కుప్పకూలి మరణించారు. మృతుడిని 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేశ్‌గా గుర్తించారు. సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేశ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గణేశ్ గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -