Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోరుబావి పునరుద్ధరణ పనులకు మార్కౌట్ వేసిన ఎంపీడీఓ

బోరుబావి పునరుద్ధరణ పనులకు మార్కౌట్ వేసిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బోరుబావి పునరుద్ధరణ పనులకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ మారుతి నార్కౌట్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల వద్ద బోరుబావిని పునరుద్ధరించేందుకు వీబీజీ రామ్ జీ పథకంలో భాగంగా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ పథకాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం బోరు బావిలో భూగర్భ జలాలను పెంచే పద్ధతిలో భాగంగా అందుబాటులో ఉన్న స్వచ్ఛమైన నీటిని, వృధా చేయకుండా వడపోత చేసి బోర్వెల్ లోపలికి పంపిస్తారు. ఇలా చేయడం వలన భూగర్భ జలు పెరిగి, ఎండిపోయిన బోర్లు తిరిగి నీరు పోయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పనులను చేసే ముందు బోర్వెల్ చుట్టూ పొడవు, వెడల్పు, లోతు గుంతను తీసి రాళ్లు, కంకర, ఇసుకను, వరుస క్రమంలో అమరుస్తారు. వర్షపు నీరు లేదా పైకప్పు మీద నుండే నీటిని ఈ గుంతలోకి మళ్లిస్తారు. ఆ నీరు ఇసుక రాళ్ల గుండె పోయి వడపోయబడి స్వచ్ఛందంగా బోరులోకి చేరుతుంది. ఈ ప్రక్రియ వలన బోరుబావి వట్టిపోకుండా ఉండడమే కాకుండా నిరంతరంగా నీటిని పంపించడం జరుగుతుంది. ఈ విధానాన్ని బోర్వెల్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రామాలలో ఈ పథకం అనుసరించి వినియోగంలోకి తీసుకువచ్చి భూగర్భ జలాలు పెంచే విధంగా తోడ్పాటున అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్ , ఎంపిడీవో శ్రీనివాస్, తహసిల్దార్ మారుతి,నార్కౌట్  డిప్యూటీ తాసిల్దార్ హేమలత, ఆర్ ఐ మోహన్, మండల పరిషత్ సూపరిండెంట క్రాంతి కుమార్ ,  ఎంపీ ఓ రాము, ఏపీవో తులసి రామ్, ఈసీ స్వామి దాస్, టి ఏ లు రమేష్ , రవీందర్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -