Saturday, August 8, 2026
E-PAPER
Homeఆటలునేడు ఇండియన్‌ ఫైట్‌ లీగ్‌

నేడు ఇండియన్‌ ఫైట్‌ లీగ్‌

- Advertisement -

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఎంఎంఏ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) లీగ్‌లో ప్రాంఛైజీ తరహా పోటీలు ఇండియన్‌ ఫైట్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌)కు హైదరాబాద్‌ వేదిక కానుంది. నేడు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా తొలిసారి ఇండియన్‌ ఫైట్ లీగ్‌ జరుగనుంది. ఐఎఫ్‌ఎల్‌లో హైదరాబాద్‌, నార్త్‌ఈస్ట్‌ జట్ల తరఫున 24 మంది ఫైటర్లు పోటీపడనున్నారు. ఈ పోటీల్లో భారత ఫైటర్లతో పాటు విదేశీ ఫైటర్లు సైతం బరిలోకి దిగుతున్నారు. ఇండియన్‌ ఫైట్‌ లీగ్‌ పోటీలతో హైదరాబాద్‌తో పాటు భారత్‌లో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు ఆదరణ పెరుగుందనే విశ్వాసం నిర్వాహకులు వెలిబుచ్చారు. నేడు ఓవరాల్‌గా 12 ఫైట్స్‌ జరుగనుండగా.. అందులో రెండు మెగా ఫైట్స్‌ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ప్రశాంత్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -