Monday, July 20, 2026
E-PAPER
Homeజాతీయంసోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల..

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో నీట్ పేపర్ లీక్ కు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 21 రోజుల నుంచి ఆయన ఈ దీక్షను కొనసాగిస్తుండగా.. అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఉదయం సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి విక్రమ్ మోహన్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ , సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స అందించిన డాక్టర్లు ఆదివారం ఉదయం 8. 30 గంటలకు సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

అందులో ప్రస్తుతం ఆయనకు లభిస్తున్న వైద్య సహాయంపై క్లారిటీ ఇస్తూ.. ఆయన వైటల్ పారామీటర్స్ (బిపి, పల్స్ రేటు) ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నట్లు వెల్లడించాయి. అయితే, దీర్ఘకాలిక నిరాహార దీక్ష ప్రభావం, శారీరక శ్రమ వల్ల ఆయన బ్లడ్ పారామీటర్స్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని వైద్యులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వైద్య నిపుణుల బృందం నిరంతరం నిఘా ఉంచిందని, 24 గంటల క్లినికల్ మానిటరింగ్ ద్వారా ఆయన రక్తం, ఇతర పరీక్షల నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆస్పత్రి యంత్రాంగం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -