Tuesday, July 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంత ఈజీ కాదు!

అంత ఈజీ కాదు!

- Advertisement -

ఇరాన్‌పై భూతల దాడులు నష్టదాయకమంటున్న విశ్లేషకులు
వాషింగ్టన్ :
పర్షియన్ గల్ఫ్‌లోని కొన్ని ఇరాన్ దీవులను స్వాధీనం చేసుకునే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ ఇటీవలి కాలంలో మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో భూతల దాడుల అవకాశాలపై ప్రజలలో తిరిగి చర్చ మొదలైంది. ఇప్పటి వరకూ వైమానిక, క్షిపణి దాడులకే పరిమితమైన అమెరికా తదుపరి సైనిక చర్యగా ఇరాన్ భూభాగంలో దాడులకు దిగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆధునిక యుద్ధభూమిలో భూతల దాడులపై పరిశీలన జరపడానికి, వాటిని విజయవంతంగా నిర్వహించే సామర్ధ్యం ఉండడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భూతల దాడులపై సైన్యం అధ్యయనం చేయవచ్చు. కానీ దానికి వాస్తవ రూపం కల్పించాలంటే అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. సైఁక సామర్ధ్యం, భౌగోళిక పరిస్థితులు మొదలుకొని వాతావరణ పరిస్థితులు, ప్రజాభిప్రాయం, రాజకీయంగా జరిగే నష్టం వరకూ అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలి. ఇరాన్ కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
పరిమిత చర్యే మేలు
ఇరాన్ వంటి దేశాన్ని ఆక్రమించడం అంత తేలికైన విషయం కాదు. ఇరాన్ కు అపారమైన భూభాగం ఉంది. జనాభా కూడా ఎక్కు వే. దాని సైనిక నిర్మాణాన్ని, మధ్యప్రాచ్యంలో దానికి ఉన్న వ్యూహాత్మక స్థానాన్ని తక్కు వగా అంచనా వేయకూడదు. అలాంటి దేశంపై భూతల దాడులకు దిగాలంటే వేలాది సైనిక దళాలు అవసరమవుతాయి. వైమానిక మద్దతు, సాయుధ దళాలు, ఆయుధ నిల్వలు, ఇంజినీరింగ్ సామర్ధ్యాలు, ఆస్పత్రులు, మందుగుండు సామగ్రి సరఫరాలు, సురక్షితమైన లాజిస్టిక్ మార్గాలు…ఇవన్నీ అవసరమే. మరీ ముఖ్యంగా ప్రతి దాడులను తట్టుకుంటూ భూభాగాన్ని స్వాధీనం చేసు కోవాల్సి ఉంటుంది. అమెరికా కనుక నిజంగానే భూతల దాడులను గురించి ఆలోచిస్తుంటే ఇరాన్ భూభాగాన్ని పెద్ద ఎత్తున ఆక్రమించుకోవడంపై కాకుండా వ్యూహాత్మక ఆధిపత్యం కోసం పరిమిత చర్యకు దిగడంపై దృష్టి సారిం చడం మంచిదని సైనిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని ఇరాన్‌పై ఒత్తిడి తేవాలని, చర్చల వేదిక వద్దకు ఆ దేశాన్ని తిరిగి తీసుకొని రావాలని మరికొందరు సూచించారు.
దీవులపై దాడులు తేలికే కానీ…
ఏ ప్రాంతాన్ని అయినా స్వాధీనం చేసుకోవడం సులభమే కానీ దానిపై పట్టును కొనసాగించడమే కష్టం. ప్రధాన భూభాగంపై కాకుండా దీవులపై దాడులు చేయడం తేలిక. ఎందుకంటే ఆ ప్రాంతం చిన్నదిగా ఉంటుంది. సరిహద్దులు స్పష్టంగా ఉంటాయి. దళాల అవసరం కూడా పరిమితంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. దీవులకు ఇంధనం, సైనిక దళాలు, వైద్య పరికరాలను తరలించడం కష్టంతో కూడిన పని. పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ దీవులు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. ఇవి ప్రధాన భూభాగం నుంచి వేరుపడి ఉంటాయి. కాబట్టి దాడి చేసే దేశాలకు శాశ్వతంగా సరఫరాలు జరగాల్సి ఉంటుంది. దీవులపై దాడులను ముందుగానే పసిగట్టడం తేలిక. తద్వారా వాటిని ఎదుర్కొనేందుకు దళాలను సిద్ధం చేయడానికి కావాల్సినంత సమయం ఉంటుంది.
తప్పని సవాళ్లు
ఒకవేళ భూతల దాడిలో ఇరాన్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందఁనిఅనుకున్నా ఆ తర్వాత అది అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలం పాటు ఇరాన్‌పై పెత్తనం చెలాయించడం అసాధ్యం. ప్రతి దాడులను ఎదుర్కొంటూ సరఫరాలను రక్షించుకోవడం అంత తేలిక కాదు. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. క్షేత్ర స్థాయిలో విజయం సాధించడం సులభమే కానీ ఆ ప్రయోజనాలను కాపాడుకోవడం చాలా కష్టం. వేసవి కాలంలో పర్షియన్ గల్ఫ్, దక్షిణ ఇరాన్‌పై దాడులు చేయడం దుర్లభం. ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది. వైమాఁక దాడులతో పోలిస్తే భూతల దాడులలో ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. శత్రువుకు పట్టుబడే సైనికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. యుద్ధం కనుక దేశీయ సంక్షోభానికి దారితీస్తే రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. పైగా ఇరాక్ అనుభవాలు అమెరికాను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -