కేటీఆర్‌కు సీజీఎం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆగస్టు 1వ తేదీన నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ’అనే అంశంపై నిర్వహించే సెమినార్‌కు ఉపన్యాసకులుగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పి ప్రభాకర్, సంపాదకులు రాంపల్లి రమేష్ ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి వారు ఆహ్వానపత్రికను అందజేశారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొన్నారు. లౌకిక విలువలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న సెమినార్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున ఉపన్యాసకులుగా పాల్గొనాలని కోరారు. ఈ సెమి నార్‌కు టీపీసీసీ చీఫ్, సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులను కూడా ఆహ్వానిస్తామని వివరించారు. నవతెలంగాణ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే సెమినార్‌లో తప్పకుండా పాల్గొంటానని కేటీఆర్ ఈ సందర్భంగా హామీనిచ్చారు. ఆహ్వాన పత్రిక అంద జేసిన వారిలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ రఘు, స్టేట్ బ్యూరో చీఫ్ బివిఎన్ పద్మరాజు, బ్యూరో ప్రతినిధి బొల్లె జగదీశ్వర్ ఉన్నారు.
నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



