దీక్ష చేపట్టిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్
ప్రారంభించిన అధ్యక్షులు చుక్క రాములు
ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి
లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వయస్సు పైబడి పని చేయలేని స్థితిలో ఉన్న, అనారోగ్యంపాలై మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రధాన కార్యాలయం (సీడీఎంఏ) వద్ద సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్ 24 గంటల దీక్షను చేపట్టారు. ఆయనతో పాటు యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పి. సుధాకర్, గుర్రం అశోక్, జన్ను ప్రకాష్, ఎ. వెంకటేష్, ఎస్. వెంకటస్వామి, ఎర్రా నర్సింహులు, అగ్గిమల్ల స్వామి, మహేష్ దీక్షలో కూర్చున్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు వారికి పూలమాలలేసి వేసి దీక్షను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో చుక్క రాములు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 64 వేల మంది మున్సిపల్ కార్మికులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తు న్నారని తెలిపారు. వారంతా ప్రాణాంతకమైన అంటువ్యాదుల నుండి ప్రజలను కాపాడు తున్నారని వివరించారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా వారు ప్రజలకు సేవలందిస్తు న్నార న్నారు. ప్రజల ఆరోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వా నికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా..వారి సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో వారసులకు పని కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్మికుల వారసులకు ఎందుకు పని కల్పించటం లేదని ప్రశ్నించారు అనేక ఆందోళ నలు-పోరాటాలను ఆ సంఘం నిర్వహించిందని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చిందని తెలిపారు. అనివార్యంగా దీక్షకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో పాటు, పోరాటంలో నేరుగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ దీక్షలో కూర్చు న్నారన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మున్సిపల్ మహిళా నాయకులకు పూలమాలలేసి దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిత్యం మురికి కూపాలల్లో , దుమ్ము, దూళిలో పని చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో తాము అనారోగ్యాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కనీస రక్షణ సదుపాయాలు ఎందుకు కల్పించటం లేదని ప్రశ్నించారు. ‘ఈ పనిలో ఎక్కువ మంది సామా జికంగా వెనుకబడిన వారే పనిచేస్తారు. అందులో మహిళా కార్మికులు అధికంగా ఉంటారు’. అందుకే వీరి పట్ల చిన్న చూపా అని ప్రశ్నిం చారు. ఇది ప్రభుత్వ వివక్షని చెప్పారు. రోజుకు 10-12 గంటల పాటు పనిచేయడం వల్ల, సరైన తిండి, విశ్రాంతి లేక అనారోగ్యానికి గురై కొంత మంది చనిపో యారని, అటువంటి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అదుకుని, వారి వారసులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి వారసులకు పని కల్పించాలని ఆందోళనా-పోరాటాలు చేసినప్ప టికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చిందని చెప్పారు. అందుకే దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. అనేక కారణాలరీత్యా ప్రమాదాలకు గురై, అనా రోగ్యంపాలైన వారున్నారన్నారు. ప్రమాదంలో మరణించిన కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతు న్నాయని ఆందోళ న వ్యక్తం చేశారు. పిల్లలు అనాధలుగా మారుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనే జీవనాధారంగా బతుకు తున్న కార్మికుల కుటుంబ సభ్యులు తాము ఈ పనినే చేసుకుం టామని అడుగు తున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించకుండా నిరాకరించడం సమంజసం కాదన్నారు. విష వాయువులను ఉత్పత్తి చేసే డ్రైనేజ్ పనులు చేయించడం వల్ల ఆ దుర్గంధానికి కార్మికులు బలౌతున్నారని వివరిం చారు. తమ యవ్వనాన్ని, శక్తిని పారిశుద్ధ్య పనికే ధారబోస్తే చివరికి వృద్ధాప్యంలో అనాధలుగా మారుతు న్నారని తెలిపారు. సమాజం కోసం ఇంతటి త్యాగాన్ని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం బాధ్యత వహించి వారి పనికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య పను లను కూడా బేరం పెడుతు న్నారని, మున్సిపల్ పాలక మండలలు ఏర్పాటు తర్వాత ఈ పనిని రూ.6-10 లక్షలకు అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువం టివారి పైన చట్టపర మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017లో అనేక ఆందోళనా – పోరాటాల ఫలితం గా గత ప్రభుత్వ హయాంలో చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించే విధంగా జీఓను సాధించు కున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మున్సిపాల్టీల్లో కొత్తగా ఎవరి నియా మకాలు చేయకూడదంటూ ఉత్తర్వు లు ఇవ్వడం తో అనేకమంది వారసులు పని కోల్పోయారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్‌లో ఈ నియామకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీక్షకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంక టేష్, పుప్పాల శ్రీకాంత్, బి. మధు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు దశరథ్, మల్లేశ్ మద్దతు తెలిపారు.
దిగొచ్చిన అధికారులు..
దీక్షతో అధికారులు దిగొచ్చారు. యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ దీక్ష వద్దకు వచ్చి సీఐటీయూ మున్సిపల్ యూనియన్ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రధాన సమస్యగా ఉన్న మున్సిపల్ కార్మికుల వారసులకు పని కల్పించడానికి ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు పంపుతున్నామని రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు.
మున్సిపల్ కార్మికుల వారసులకు పని కల్పించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



