Tuesday, July 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దు

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దు

- Advertisement -

సీఎస్సీ సంస్థ చేస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలి :
బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్
వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
నవతెలంగాణ-ముషీరాబాద్/విలేకరులు

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దని, సీఎస్‌సీ సంస్థ నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్ర క్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వ ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు జరిగాయి. అధికారులకు సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వంగూరు రాములు మాట్లాడారు. జీవో నెం.12తో తెలం గాణ భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీంలను ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి రూ.346 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని ఆరోపించారు.
లేబర్ డిపార్ట్‌మెంట్ సీఎస్‌సీ సంస్థ ద్వారా హెల్త్ టెస్టుల పేరుతో రూ.750 కోట్లు కార్మికుల సొమ్మును దొడ్డిదారిన ఆ సంస్థకు అప్పగించిందని అన్నారు. వెల్ఫేర్ బోర్డులో 54 వేల పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించకుండా, 13 లక్షల మంది కార్మికులకు లేబర్ కార్డులను పునరుద్ధరిం చకుండా, కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా వేల కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ కంపెనీలు, సీఎస్‌సీ సంస్థలకు మళ్లించడం అన్యాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి వారి కడుపుకొట్టే చర్యలు మానుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డు పథకాలను నేరుగా కార్మి కులకే అమలు చేయాలని, ప్రమాద మరణ పరి హారాన్ని రూ.10 లక్షలుగా, సహజ మరణ పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని, 2009 నుంచి పునరుద్ధరణ కాకుండా ఉన్న 13 లక్షలకుపైగా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన రెన్యువల్ చేయాలని కోరారు. లేబర్ కార్యాలయాల ద్వారానే మీ సేవా కేంద్రా లను నిర్వహించాలని, వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. కుమారస్వామి, సంఘం జిల్లా కార్యదర్శి ఎ. రాజు, అధ్యక్షులు సోమేశ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు జే. వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. నారాయణపేటలోని లేబర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనుకు వినతిపత్రం ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌లో కలెక్టరేట్‌ను ముట్టడించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆరఓ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఆర్‌డీఓకు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నలగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం నుంచి సెంట్రింగ్ ఆఫీస్ మీదుగా డీసీఎల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హనుమకొండ, మహబూ బాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -