Tuesday, July 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసెప్టెంబరులో జిన్‌పింగ్ అమెరికా పర్యటన

సెప్టెంబరులో జిన్‌పింగ్ అమెరికా పర్యటన

- Advertisement -

బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబరులో అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని చైనా తెలిపింది. ‘అమెరికా, చైనా దేశాధినేతల దౌత్యం ప్రత్యామ్నాయం లేని వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది’ అని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం తెలిపారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జిన్‌పింగ్ పర్యటనపై ప్రభావం చూపబోవంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చేసిన ప్రకటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిన్ ఈ మాట చెప్పారు. ఈ ఏడాది చివరలో ఇరు దేశాల అధినేతల మధ్య జరిగే సమావే శానికి సంబంధించిన ఏర్పాట్లపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -