Tuesday, July 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ యుద్ధంలో 
అమెరికా భారీ మూల్యం

ఇరాన్ యుద్ధంలో 
అమెరికా భారీ మూల్యం

- Advertisement -

17 మంది యూఎస్ సైనికుల మృతి
వాషింగ్టన్ :
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉత్తర ఇరాక్‌లో పేలని ఇరానీ డ్రోన్ అవశేషాలను నిర్వీర్యం చేసే క్రమంలో మరో అమెరికా సైనికుడు మృతి చెందడంతో ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది. ఈ యుద్ధం ప్రధానంగా వైమానిక దాడులు, డ్రోన్లు, క్షిపణుల ద్వారానే సాగుతున్నప్పటికీ.. అమెరికా బలగాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే కువైట్‌లోని ఓ పౌర నౌకాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. మార్చి 1న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు వారం రోజుల అనంతరం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -