- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహాత్మా గాంధీ వేషధారణలో పాల్గొన్న ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసుల లాఠీచార్జ్, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అక్కడ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యమాన్ని అహింసా మార్గంలో, శాంతియుతంగా కొనసాగించాలనే సందేశంతో ఆయన నిరసనలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన గుర్తింపు, నిరసనలో పాల్గొన్న ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు.
- Advertisement -



