Thursday, July 23, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి కామన్‌వెల్త్‌ క్రీడలు

నేటి నుంచి కామన్‌వెల్త్‌ క్రీడలు

- Advertisement -

11 రోజులు, 10 క్రీడాంశాలు, 215 మెడల్‌ ఈవెంట్స్‌
గ్లాస్గో (స్కాట్లాండ్‌) : స్కాట్లాండ్‌లోని పోర్ట్‌నగరం కామన్‌వెల్త్‌ క్రీడలకు స్పోర్ట్స్‌ క్యాపిటల్‌గా మారింది!. 2014లో కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో నగరం.. 2026 క్రీడల ఆతిథ్యం నుంచి ఆస్ర్టేలియా తప్పుకోవటం మరోసారి నిర్వహణ బాధ్యతలను తీసుకుంది. ఆర్థిక సవాళ్లు, నిర్వహణ వ్యయ భారం కామన్‌వెల్త్‌ క్రీడలను కళ తప్పేలా చేశాయి. 11 రోజులు, 10 క్రీడాంశాలు, 215 మెడల్‌ ఈవెంట్లతో నేటి నుంచి కామన్‌వెల్త్‌ క్రీడలు ఆరంభం కానున్నాయి. బ్రిటీష్‌ పాలిత దేశాలు పోటీపడే ఈ క్రీడల్లో ఈసారి 74 దేశాల నుంచి సుమారు 3 వేల మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. నేటి ఆరంభ వేడుకలతో పోటీలు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 2న ముగింపు వేడుకలతో క్రీడలు ముగియనున్నాయి. 2022లో బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో 20 క్రీడాంశాలు ఉండగా.. తాజాగా గ్లాస్గోలో వాటిని 10కు కుదించారు. బాస్కెట్‌బాల్‌, ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌, అథ్లెటిక్స్‌, బౌల్స్‌, బాక్సింగ్‌, జూడో, నెట్‌బాల్‌, స్విమ్మింగ్‌, ట్రాక్‌ సైక్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌లో 74 దేశాల క్రీడాకారులు పోటీపడనున్నారు. పారా విభాగంలో ఆరు క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. తొలి రోజు పోటీల్లో బౌల్స్‌, పారా బౌల్స్‌ ఈవెంట్లు జరుగనున్నాయి. గ్లాస్గో కామన్‌వెల్త్‌ క్రీడలకు భారత్‌ 125 మందితో కూడిన బలమైన జట్టును పంపిస్తోంది. ఒలింపిక్‌ పతక విజేతలు నీరజ్‌ చోప్రా, మీరాబాయి చాను వంటి మేటి అథ్లెట్లు గ్లాస్గోలో బరిలోకి దిగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -