Friday, July 24, 2026
E-PAPER
Homeఆటలుసెప్టెంబర్‌‌లో అఫ్గాన్‌‌తో ధనాధన్‌!

సెప్టెంబర్‌‌లో అఫ్గాన్‌‌తో ధనాధన్‌!

- Advertisement -

సెప్టెంబర్‌‌లో అఫ్గాన్‌‌తో ధనాధన్‌!
భారత్‌‌తో సిరీస్‌‌కు షెడ్యూల్‌ ఖరారు
అఫ్గాన్‌ స్వదేశీ సిరీస్‌‌కు న్యూఢిల్లీ ఆతిథ్యం

న్యూఢిల్లీ : ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్‌‌తో ఓ టెస్టు, మూడు వన్డేల సిరీస్‌ ఆడిన టీమ్‌ ఇండియా… ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌‌లో తలపడనుంది. అఫ్గనిస్తాన్‌ ‌గతంలో భారత్ వేదికగా (లక్నో, డెహ్రాడూన్‌, గ్రేటర్‌ ‌నోయిడా) స్వదేశీ సిరీస్‌‌లు ఆడినా, భారత్‌‌తో పోటీపడలేదు. అఫ్గనిస్తాన్‌ ‌స్వదేశీ సిరీస్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుండగా.. తొలిసారి భారత్‌‌ విదేశీ సిరీస్‌‌ను స్వదేశంలో ఆడనుంది. సెప్టెంబర్‌ 13, 15, 17న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో మూడు టీ20లను షెడ్యూల్‌ ‌చేశారు. అధికారికంగా షెడ్యూల్‌‌ను ప్రకటించలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ఆగస్టు 27న ముగియనుండగా.. జపాన్‌లో ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 24 నుంచి ఆరంభం కానున్నాయి. ఈ విరామంలో అఫ్గనిస్తాన్‌‌తో భారత్‌ ‌టీ20 సిరీస్‌‌లో తలపడనుందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -