Thursday, July 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'కర్మాఖ్య' ట్రైలర్ అద్భుతం

‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతం

- Advertisement -

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈనెల 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నటి విజయశాంతి మాట్లాడుతూ, ‘ఈ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది. మొదట ‘కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ‘కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. అభి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుంది. ఈ మధ్య మంచి సబ్జెక్టులతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. మేమందరం కూడా చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం. ఈ సినిమాతో దర్శకుడు అభినయ కృష్ణ విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది. హీరోయిన్ సమైరా చాలా చక్కగా చేసింది. ట్రైలర్ చూసినప్పుడు మ్యూజిక్‌లో ఒక వైబ్రేషన్ వినిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఈ సినిమాకి నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు.

వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలిఅని తెలిపారు. 'లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ కార్యక్రమానికి వచ్చి బ్లెస్సింగ్స్ అందించడం నిజంగా ఈ టీమ్ మొత్తానికి గొప్ప ప్రోత్సాహం. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. నేను సినిమాలను తరచుగా చూస్తుంటాను. 'కర్మాఖ్య' ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దర్శకుడు అభినయ కృష్ణకు, టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ అని మధు యాష్కీ చెప్పారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ,’మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మొదట ‘కామాఖ్య’ అనే టైటిల్ ఖరారు చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆ పేరుతో చాలా ప్రమోషన్స్ చేశాం. దీంతో మరో పేరు సూచించమని సోషల్ మీడియాలో వీడియో పెట్టాను. ఆ సమయంలో చాలామంది వినూత్నమైన పేర్లు పంపించారు. అందరికీ ధన్యవాదాలు. మేము ‘కామాఖ్య’ టైటిల్‌కు దగ్గరగా ఉండే సౌండింగ్‌తో ‘కర్మాఖ్య’ అనే టైటిల్‌తో వస్తున్నాం. ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. మీరు ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం కాదు. నా సబ్జెక్ట్‌పై, నేను పడిన కష్టంపై ఉన్న నమ్మకంతో చెబుతున్న మాట` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -