Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంఅసెంబ్లీ ఎన్నిక‌ల వేళ బెంగాల్‌లో కీల‌క ప‌రిణామం

అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ బెంగాల్‌లో కీల‌క ప‌రిణామం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్‌లను నియామకం చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం​ చేసింది. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -