- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. అంగన్‌వాడీకి వెళ్లిన బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపిన స్థానిక వ్యక్తి చమక పాలెయ తన ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఇంటికి చేరిన చిన్నారి జరిగిన విషయాన్ని ఏడుస్తూ తల్లికి చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -



