- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అపార్ట్‌మెంట్ 10వ అంతస్తు నుంచి దూకి మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి (27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న విష్ణు తన ఫ్లాట్‌కు వచ్చి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున ఆయన్ను కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్‌లో అపస్మారక స్థితిలో గుర్తించారు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



