Friday, July 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమరోసారి ట్రంప్ టారిఫ్‌ల మోత..

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల మోత..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా వాణిజ్యాన్ని పునర్నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల విప్లవాన్ని వేగవంతం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే షాక్‌ల నుంచి తప్పించుకుంటూ, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా ట్రంప్ సర్కార్ సరికొత్త ‘టారిఫ్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించడంలో విఫలమయ్యారనే నెపంతో భారత్, చైనా, బ్రిటన్ సహా దాదాపు 60కి పైగా ప్రపంచ భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు కొత్త దిగుమతి సుంకాలను విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

వెట్టిచాకిరీ ఉత్పత్తులపై ఎలాంటి చట్టపరమైన నిషేధాలు లేని చైనా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలకు చెందిన దిగుమతులపై గరిష్ఠంగా 12.5 శాతం పన్ను భారం వేయగా.. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో వెనుకబడిన భారత్, శ్రీలంక, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాల ఉత్పత్తులపై 10 శాతం పన్ను నిర్ణయించారు. నిజానికి భారత్‌పై కూడా 12.5 శాతం పెనాల్టీ టారిఫ్ విధిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవలి కాలంలో భారత్ చేపట్టిన నియంత్రణ చర్యలను గుర్తించిన అమెరికా వాణిజ్య ప్రతినిధి శ్రేణి.. భారత్‌పై సుంకాన్ని 10 శాతానికే పరిమితం చేసింది. అయితే చమురు, గ్యాస్, యూఎస్ఎంసీఏ ఒప్పందం పరిధిలోని నిత్యావసరాలకు ఈ టారిఫింగ్ నుండి మినహాయింపు లభించింది. భవిష్యత్తులో మితిమీరిన తయారీ సబ్సిడీలు ఇచ్చే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు ట్రంప్ బృందం వ్యూహాలు రచిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -