Monday, August 31, 2026
E-PAPER
HomeNewsసెప్టెంబర్ 5న సీజేపీ నిరసనలు..సుప్రీంలో పిటిషన్

సెప్టెంబర్ 5న సీజేపీ నిరసనలు..సుప్రీంలో పిటిషన్

- Advertisement -

నవతెలగాణ-హైదరాబాద్: సెప్టెంబర్ 5న ‘క్రాకోచ్ జనతా పార్టీ’ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీజేపీ తలపెట్టిన ధర్నాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతిఒక్కరూ శాంతియుతంగా, చట్టబద్ధంగా ప్రవర్తిస్తారని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. శాంతిభ్రదతలను నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఏది చట్టవిరుద్ధమో, ఏది అనుమతించదగినదో చెబుతూ పోలీసులు, విద్యార్థులు ఇరుపక్షాలు చట్టాన్ని గౌరవించి దానికి అనుగుణంగా ప్రవర్తించాలని ధర్మాసనం పేర్కొంది.

సెప్టెంబర్‌ 12-13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల రీత్యా ఇండియా గేట్, సెంట్రల్ విస్టా సమీప ప్రాంతాలలో పెద్దఎత్తున విద్యార్థులు చేరడాన్ని నియంత్రించాలని రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. .

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు బాగ్చి,వి.మోహనలతో కూడిన ధర్మాసనం, నీట్ నిరసనల సమయంలో పోలీసుల హింస ఆరోపణలను పరిశీలించడానికి తాము ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి విచారణ కమిటీకి తన పిటిషన్‌ను సమర్పించాలని పిటిషనర్‌ను కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 10కి వాయిదా వేసింది.

నీట్ పరీక్ష అవకతవకలకు వ్యతిరేకంగా 36రోజులు సిజెపి చేపట్టిన ఆందోళనను విరమించుకోవాలని జూలై 25న కేంద్రం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిజెపి ఆందోళనలకు పిలుపు నిచ్చింది. సెప్టెంబరు 5 ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ కు పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -