Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కత్తల్ వాడిలో పౌరహక్కులపై అవగాహన

కత్తల్ వాడిలో పౌరహక్కులపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని కత్తల్వాడి గ్రామంలో సోమవారం జరిగిన పౌరహక్కులపై అవగాహన కార్యక్రమానికి రెవెన్యూ ఇన్స్‌ పెక్టర్‌ అంజయ్య, పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. గ్రామాలలో రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అంటరానితనం అనే అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దళితులను చిన్నచూపు చూడొద్దనీ, అంటరాని వారనీ వివక్ష‍ చూపొద్దనీ, వారూ కూడా అందరిలాంటి వారేననీ, మనతో పాటు సమానంగా చూసే ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. కులం తక్కువోళ్ళనీ, ఆలయాల్లోకి రాకుండా అడ్డుకోవద్దనీ అవగాహన కల్పించారు. రాజ్యాగం ప్రకారం ఇలా చేయడం శిక్ష‍ార్హమని హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘిస్తే ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపాల్ రావు, ఉపసర్పంచ్, జీపీ కార్యవర్గ సభ్యులు, జిపిఓ శ్రీకాంత్, దళిత సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు జైపాల్, సిద్దు, రాజు, దుర్గయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -