- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని మధురతండాలో సోమవారం ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ఆ గ్రామ సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ పాల్గొన్నారు. ఈ మేరు వారు గ్రామంలోని అనారోగ్య బాధితులకు వైద్యుల సాయంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్యులు స్వయంగా గ్రామాలలోకి వచ్చి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారనీ, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



