Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి: ఎంపీడీఓ

ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మండలాధికారులతో పాటు ఎంపీడీఓ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వీలైనంత మేరకు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రజావాణికి అధికారులు తప్పక హాజరు కావాలని పేర్కొన్నారు. నిర్లక్ష‍్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయనీ, వారి నివేదికలను ఉన్నతాదికారులకు సైతం పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ పండరి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి, ఐకెపిఎపిఎ మ్ వందేమాతరం, ఈజిఎస్ ఏపీవో తులసి రామ్, రెవెన్యూ శాఖ, అటవి శాఖ, హౌసింగ్ శాఖ, గ్రామీణ త్రాగునీటీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -