Sunday, September 20, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర హోం మంత్రికి సీపీఐ జనరల్ సెక్రటరీ లేఖ

కేంద్ర హోం మంత్రికి సీపీఐ జనరల్ సెక్రటరీ లేఖ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సీపీఐ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అందుకు సంబంధిత అధికారుల నుంచి ముందుస్తు అనుమతులు కూడా తీసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనకుండా యూపీలోని యోగి ప్రభుత్వం పలువురు పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తోంది. యోగీ ప్రభుత్వ చర్యలపై సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

అన్యాయంగా తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని, నిరసనలకు తాము అనుమతి తీసుకున్నామని తెలియజేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని, తమ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్ ల విషయంలో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

“ఇటువంటి చర్యలు భారత రాజ్యాంగం ప్రజలకు, వివిధ చట్టాల ద్వారా రాజకీయ పార్టీలకు కల్పించిన ప్రాథమిక హక్కులను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య హక్కులను నిరాకరించడమే అవుతుంది.” సీపీఐ కార్యకర్తలపై ఎలాంటి చట్టవిరుద్ధమైన, అప్రజాస్వామిక చర్యలు తీసుకోకుండా పోలీసులకు, రాష్ట్ర యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన లేఖలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -