Saturday, September 19, 2026
E-PAPER
HomeNewsశంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌ శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది పాలమాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్‌పేట మండలం, చౌడుర్ గ్రామానికి చెందిన వారి పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -