Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంధర్మేంద్ర ప్రధాన్ ఒక "క్రిమినల్ విద్యాశాఖ మంత్రి"

ధర్మేంద్ర ప్రధాన్ ఒక “క్రిమినల్ విద్యాశాఖ మంత్రి”

- Advertisement -
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ :NEET-UG వివాదంపై పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక “క్రిమినల్ విద్యాశాఖ మంత్రి” అని, ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల డిమాండ్లను ప్రస్తావించారు; ఇందులో జూలై 20న జరిగిన ‘సంసద్ చలో’ (పార్లమెంట్ మార్చ్) సందర్భంగా విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యువతకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. “ధర్మేంద్ర ప్రధాన్ ఒక నేరపూరిత విద్యాశాఖ మంత్రి. ఆయనను తొలగించాలి. మన విద్యా వ్యవస్థ పతనానికి ఆయన ఒక ప్రతీక. ఆయన వెళ్ళిపోవాలి. వేలాది మంది విద్యార్థులు రోడ్లపాలు కావడానికి ఆయనే కారణం. ఆయన పదవి నుంచి తప్పుకోవాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.

“పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో పెల్లెట్ గన్ (pellet gun) గాయాలపాలైన ఒక నిరసనకారుడిని రాహుల్ గాంధీ మీడియా ముందు ఉంచారు. “శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు యువకుడుపై పెల్లెట్ గన్ దాడిలో గాయపడ్డాడని తెలియజేశారు. ప్రభుత్వం మాత్రం పెల్లెట్ గన్‌ను ఉపయోగించలేదని చెబుతోంది. అతని కన్ను దెబ్బతింది, చూపు నిలుస్తుందో లేదో తెలియదు. ఇలాంటి వేలాది మంది యువకులపై లాఠీచార్జ్ చేశారు, వారిపై పెల్లెట్ గన్‌లను ప్రయోగించారు. అతను పోలీస్ నియామక పరీక్ష రాశాడు, కానీ పేపర్ లీక్ అయింది.”అని రాహుల్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -