నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో చర్చలు సాగించింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి. కాన్ట్సిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.
‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.



