Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేపర్ లీక్‌పై ఆందోళనలు..కేంద్రం కీలక నిర్ణయం

నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనలు..కేంద్రం కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ-హైరదాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రివర్గం శుక్రవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలను ఆమోదించింది. పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్‌లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత సవరణ బిల్లును సోమవారం (జూలై 27) పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పేపర్ లీక్‌పై జవాబుదారీతనం, సమగ్ర దర్యాప్తు, ప్రభుత్వ పరీక్షల సమగ్రతను కాపాడటానికి బలమైన రక్షణ చర్యలు కావాలని జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు, జూలై 20న జరిగిన “సంసద్ చలో” (పార్లమెంట్ మార్చ్)తో ముగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -