- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. ఆమె నిన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్నారు. ఇకపై అలా మాట్లాడకూడదని సూచిస్తున్నట్లు తెలిపారు. బాహాటంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడితే కాంగ్రెస్ ఒప్పుకోదన్నారు. సురేఖ తీరు ఆక్షేపణీయంగా ఉండడంతోనే చర్యలు తీసుకున్నారని అని వెల్లడించారు.
- Advertisement -



