- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టారు.
- Advertisement -



